దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

Update: 2020-09-29 08:45 GMT

దివంగత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 9న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. నామినేష‌న్ల‌ను 17న ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19.

ఇదిలావుంటే దుబ్బాక అసెంబ్లీ టిక్కెట్ ఎవరికిస్తారన్న దానిపై టిఆర్ఎస్ లో స్పష్టత లేదు. అయితే దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్‌ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది, అంతేకాకుండా మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా టిఆర్ఎస్ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నాగేశ్వరరెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు లు ఆయా పార్టీల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయా పార్టీలు ప్ర‌చార ప‌ర్వాన్ని మొద‌లు పెట్టాయి. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డంతో నేటి నుంచి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది.

షెడ్యూల్‌..

నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9

నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16

నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17

ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19

పోలింగ్ తేదీ : నవంబర్ 3

కౌంటింగ్ తేదీ నవంబర్: 10

Tags:    

Similar News