Edupayala Jatara: ముస్తాబైన ఏడుపాయల వనదుర్గ ఆలయం
Edupayala Jatara: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వన దుర్గామాత శివరాత్రి జాతర ఉత్సవాలకు ముస్తాబయింది..
Edupayala Jatara: మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలకు ఏడుపాయల వనదుర్గ ఆలయం ముస్తాబైంది. గురువారం నాడు పంచామత అభిషేకం.. అలంకారము సహస్రనామ కుంకుమార్చనతో భక్తులు ఉపవాస దీక్షలతో జాతర ప్రారంభమవుతోంది. రెండవ రోజు బండ్లు తిరుగుట, మూడవ రోజు సాయంత్రం రథోత్సవ కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. జాతరకు సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
దేశంలో దుర్గామాత ఆలయం రెండోది..
మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. దేశంలో దుర్గామాత ఆలయం రెండోది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఎమ్మెల్యే పద్మదేవేందర్ అన్నారు. జాతరకు సింగూర్ డ్యాం నుంచి 0.4టీఎంసీల నీరు విడుదలయ్యాయని తెలిపారు. దీంతో భక్తులు మంజీరా నదిలో స్నానం చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మహాశివరాత్రి వేడుకలను వనదుర్గమాత ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది సిద్ధమయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పారిశుద్ధ్యం కార్మికులతో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని రెడీగా ఉంచినట్టు అధికారులు వెల్లడించారు..