ఇవాళ మరోసారి నందకుమార్‌ను విచారించనున్న ఈడీ
*చంచల్‌గూడ జైలులో నందకుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న ఈడీ
Telangana News: ఇవాళ మరోసారి నందకుమార్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. చంచల్ గూడ జైలులో నందకుమార్ స్టేట్‌మెంట్ ఈడీ రికార్డు చేయనుంది. ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో ఉన్న సంబంధాలు, వ్యాపారాల లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో 100కోట్ల రూపాయల డీల్‌పై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్‌పై విచారణ జరుపనున్నారు. 7హిల్స్ మానిక్ చంద్ గుట్కా వ్యాపారి అభిషేక్ మధ్య 7కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై నందకుమార్‌ను ప్రశ్నించనున్నారు. సోమవారం నందకుమార్‌ను ఈడీ అధికారులు 4 గంటల పాటు విచారించారు.