ఇవాళ విచారణకు రావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

Liquor Scam Case: ఆరు నెలల తర్వాత మళ్లీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు

Update: 2023-09-15 03:04 GMT

ఇవాళ విచారణకు రావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

Liquor Scam Case: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులివ్వడంతో లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ కవితకు ఈడీ నోటీసులు పంపింది. అయితే దాదాపు మూడు నెలల పాటు లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ప్రస్తావనకు రాలేదు. దీంతో కవితకు క్లీన్‌చిట్ వచ్చినట్లేనన్న వార్తలు గుప్పుమన్నాయి. బీజేపీతో బీఆర్ఎస్‌కు కుదిరిన సీక్రెట్ అగ్రిమెంట్‌లోనే భాగంగానే.. ఈ కేసులో దర్యాప్తును ఈడీ జోరును తగ్గించిందనే ప్రచారం జరిగింది.

ఈడీ నోటీసులు అందడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నోటీసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న ఆమె.. ఆ వ్యవహారాన్ని అంతా తన లీగల్‌ టీమ్ చూసుకుంటుందని తెలిపారు. లిక్కర్ కేస్ ఏడాది నుంచి టీవీ సిరియల్‌లా నడుస్తోందన్న కవిత.. ఎన్నికలు వస్తున్నాయని మరో ఎపిసోడ్‌కు బీజేపీ తెర తీసిందని ఆరోపించారు.

ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో దినేష్ అరోరా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్లుగా మారారు. చివరిసారిగా లిక్కర్ కేసులో మార్చి 16, 20, 21వ తేదీల్లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. ప్రస్తుతం 6 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు మళ్లీ యాక్టివిటీని మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది.

మరో వైపు ఇవాళ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణకు రానుంది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. కవిత పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ జరపనుంది.

Tags:    

Similar News