Rohith Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ నన్ను ప్రశ్నించింది
Rohith Reddy: నా కుటుంబ,. వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు
Rohith Reddy: TRS ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణ రెండో రోజు ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 7గంటల పాటు ఎమ్మెల్యేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ రెడ్డి.. తనను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే విచారిస్తున్నట్లు ఈడీ క్లారిటీ ఇచ్చిందన్నారు. కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే ఈడీ వివరంగా ప్రశ్నలు అడిగిందని తాను కూడా విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పారు.
బీజేపీ కుట్రను బయటపెట్టిన ఘటన గురించి వివరించినట్లు తెలిపారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. తన వ్యక్తిగత వివరాలు, ఫ్యామిలీ, విదేశీ టూర్లు, ఆస్తులు, వ్యాపారాల వివరాలను ఈడీ అధికారులు అడిగారని రోహిత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తనను ఈడీ ఎందుకు విచారిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తనను మళ్లీ ఈ నెల 27న విచారణకు రావాలని ఈడీ చెప్పిందన్నారు. ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అని రోహిత్‌రెడ్డి విమర్శించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తనని ఈడీ అధికారులు రెండ్రోజులు ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. వివిధ కోణాల్లో చాలా ప్రశ్నలు అడిగినట్లు రోహిత్‌రెడ్డి వివరించారు.