Formula E Race: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు..

Formula E Race: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ లో అక్రమ బదిలీలపై విచారణ కొనసాగుతుంది.

Update: 2024-12-30 04:38 GMT

Formula E Race: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు..

Formula E Race: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ లో అక్రమ బదిలీలపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. జనవరి 2, 3 తేదీల్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ ఎన్ రెడ్డిని విచారించనున్నారు. జనవరి ఏడవ తేదీన బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.

రేపు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ కొనసాగనున్నది. హైకోర్టులో కేసు కొట్టివేస్తే ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రేపటితో కేటీఆర్ నాట్ టూ అరెస్ట్ హైకోర్టు ఆర్డర్ ముగియనున్నది. హైకోర్టులో జరగనున్న విచారణపై కేటీఆర్ ఆశలు పెంచుకున్నారు. కేటీఆర్ ను ముందుగా ఈడీ అరెస్ట్ చేస్తుందా.. లేక ఈడీనా.. ఏసీబీనా అన్నది ఉత్కంఠ రేపుతుంది.

Full View


Tags:    

Similar News