జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ విడుదల

ఫిబ్రవరి 10తో ముగియనున్న పాలకమండలి గడువు గెజిట్ విడుదల చేసిన నెలరోజుల్లోపు ప్రమాణాస్వీకారం

Update: 2021-01-16 11:33 GMT

గ్రేటర్‌ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సభ్యుల పేర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఆ తర్వాతే కొత్త పాలకమండలి కొలువుదీరే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఎన్నికల సంఘం కొత్త కార్పొరేటర్ల పేర్లతో గెజిట్‌ విడుదల చేసింది. గెజిట్‌ విడుదల చేసిన నెల రోజుల్లోపు గెలిచిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. మొన్నటి ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. 

Tags:    

Similar News