తెలంగాణ రాష్ట్రానికి మరో కొత్త కంపెనీ

Easter Filmtech Ltd in Telangana : తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ది చెందుతుంది. రాష్ట్రానికి కొత్త కొత్త ఐటీ కంపెనీల వెల్లువ కొన‌సాగుతున్న‌ది.

Update: 2020-08-17 12:40 GMT
Easter Filmtech Ltd

Easter Filmtech Ltd in Telangana : తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ది చెందుతుంది. రాష్ట్రానికి కొత్త కొత్త ఐటీ కంపెనీల వెల్లువ కొన‌సాగుతున్న‌ది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఈస్ట‌ర్ ఫిల్మ్‌టెక్ లిమిటెడ్ సంస్థ తన ప్యాకేజింగ్ ఫిల్మ్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈస్ట‌ర్ ఫిల్మ్‌టెక్ సంస్థ చైర్మ‌న్ అర‌వింద్ సింఘానియాతో ఈ రోజు వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటవుతున్న విషయాన్ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఈస్ట‌ర్ కంపెనీ రాక ప‌ట్ల ఆయన వ్య‌క్తం చేశారు. 1350 కోట్ల పెట్టుబ‌డితో కంపెనీని ఏర్పాటు చేస్తున్నార‌ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా చెప్పారు. తెలంగాణ‌లో ఈస్ట‌ర్ కంపెనీ అడ్వాన్స్‌డ్ పాలిస్ట‌ర్ ఫిల్మ్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభిస్తుంది.

ఈ కంపెనీ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులైన యువతలో సుమారుగా 800 మందికి ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయి. ఈ కంపెనీ నిర్మాణంతో ప్యాకేజింగ్ ప‌రిశ్ర‌మ‌లో తెలంగాణ‌కు ప్ర‌త్యేక స్థానం వ‌స్తుంద‌ని తెలిపారు. అయితే ఈ కంపెనీ తొలి ద‌శ నిర్మాణానికి గాను 500 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. 2022 మూడ‌వ క్వార్ట‌ర్‌లో తొలి ద‌శ పూర్తి కానుందని తెలిపారు. అంతే కాదు ఈ సంస్థ ద్వారా 30 నుంచి 40 శాతం వ‌ర‌కు త‌మ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేయ‌నున్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. ప్యాకేజింగ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన పాలిమ‌ర్ ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ త‌యారు చేస్తారు.

ఇక పోతే భారతదేశంలో పాలిస్ట‌ర్ ఫిల్మ్స్ ఉత్ప‌త్తుల్లో ఈస్ట‌ర్ ప‌రిశ్ర‌మ అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. తెలంగాణ‌లో ఉన్న ఇండ‌స్ట్రీ ఫ్రెండ్లీ విధానాల వ‌ల్లే ఆ రాష్ట్రంలో కంపెనీ పెట్టేందుకు నిర్ణ‌యించిన‌ట్లు ఈస్ట‌ర్ సంస్థ చైర్మ‌న్ అర‌వింద్ సింఘానియా తెలిపారు. త‌మ పాలిమ‌ర్ ఉత్ప‌త్తుల‌ను ఈస్ట‌ర్ కంపెనీ సుమారు 56 దేశాల‌కు ఎగుమ‌తి చేస్తుంది. వృద్ధి ల‌క్ష్య విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ తెలంగాణ ముందుందన్నారు.

 



 

Tags:    

Similar News