Earthquake: మహబూబ్ నగర్ జిల్లా దాసరిపల్లిలో భూకంపం: రిక్టర్ స్కేల్ పై 3.0 తీవత్ర నమోదు
Telangana earthquake: మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో శనివారం భూమి కంపించింది.
Earthquake: మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో శనివారం భూమి కంపించింది.మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో భూమి కంపించింది.జూరాల ప్రాజెక్టు ఎగువన, దిగువన భూకంపం వచ్చింది. భూమిలోపల 40 కి.మీ. భూకంపం సంభవించింది.
రెండు రోజుల క్రితం కూడా ఇదే జిల్లాలో భూమి కంపించింది. తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.0 గా నమోదైంది. ఈ నెల 5న గోదావరి పరివాహక ప్రాంతంలో భూకంపం సంభవించింది.ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా భూమి కంపించింది. భూమికి 40 కి.మీ లోతులో భూమి కంపించింది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ నిశ్చలంగా ఉండే గ్రానైటిక్ రాక్స్ తో ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతానికి భూకంపంతో ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. మేడారం కేంద్రంగా భూకంపం ఏర్పడడానికి కారణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.