Eamcet Exams: తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు

Eamcet Exams: ఎంసెట్‌ రాయనున్న 2,51,132 మంది విద్యార్థులు

Update: 2021-08-03 01:25 GMT

తెలంగాణాలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు (ఫైల్ ఇమేజ్)

Eamcet Exams: తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఎంసెట్‌కు మొత్తం 2లక్షల 51వేల 132 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ కు 1,64,678 మంది, మెడికల్ ఎంట్రన్స్‌ కు 86,454 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణలో 82 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల కోసం 23 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ గోవర్ధన్ వెల్లడించారు.

అయితే ఈసారి ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదు. కోవిడ్‌తో క్లాసులు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రంలో కోవిడ్ రూల్స్ పాటించాలని విద్యార్థులకు గోవర్ధన్ సూచించారు. ఈసారి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫాం నింపాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు అధికారులు. 

Tags:    

Similar News