హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిటిషన్‌

ఇటివల వెలువడిన దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో రఘునందన్ రావు సంచలన విజయం సాధించి మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేశారు.. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పైన విజయం సాధించారు.

Update: 2020-11-12 11:43 GMT

దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌‌ను కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తనిఖీల్లో 18లక్షల రూపాయలు దొరికినట్లు కట్టుకథలు అల్లారని రఘునందన్ తన పిటిషన్‌లో హైకోర్టుకు తెలిపారు. అయితే, రఘునందన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ జస్టిస్‌ లక్ష్మణ్ బెంచ్‌‌కు రావడంతో విచారించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులను ప్రధాన న్యాయమూర్తి మాత్రమే విచారణ జరపాల్సి ఉందన్న జస్టిస్ లక్ష్మణ్ పిటిషన్‌ను సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించారు.

ఇటివల వెలువడిన దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో రఘునందన్ రావు సంచలన విజయం సాధించి మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేశారు.. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పైన విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.

Tags:    

Similar News