దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి తొలి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఆరో, ఏడో రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. దుబ్బాక కౌంటింగ్ ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి 2,718 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2,536 ఓట్లు పడ్డాయి. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ కన్నా 182 ఓట్లు ఎక్కువ పడ్డాయి. వరుసగా రెండు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చేసరికి బీజేపీ ఆధిక్యం తగ్గుతోంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యం 2,485కి చేరింది.
దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. తొలి ఐదు రౌండ్‌లో బీజేపీ హావా కొనసాగించింది. ఆరో రౌండ్, ఏడో రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ లీడ్‌లోకి వచ్చింది. దాంతో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తం 23 రౌండ్లు ఉండగా.. 14 టేబుల్లో కౌంటింగ్ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్ కి ఫలితాలు మారుతున్నాయి. దీంతో గెలుపు తమదేనని ధీమాతో టీఆర్ఎస్, బీజేపీలున్నాయి. కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి మూడో స్థానంలోనే కొనసాగుతుంది. ఇండిపెండెంట్‌లు ఎవరూ కూడా తమ ప్రభావాన్ని చూపించలేకపోయారు.