దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: మూడో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం

Update: 2020-11-10 04:42 GMT

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్ఎస్ హావ చూపించింది. అనంతరం ఈవీఎం లెక్కింపు మొదటి రౌండ్‌లో మాత్రం బీజేపీ ఆధిక్యంలోకి కొనసాగుతుంది.

మొదటి రౌండ్‌లో 341 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో టీఆర్ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. బీజేపీకి 3208 ఓట్లు రాగా 2,867 ఓట్లు టీఆర్ఎస్‌కు వచ్చాయి. కాంగ్రెస్ 648 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో మొత్తం 7,446 ఓట్లు లెక్కించారు.

రెండో రౌండ్‌లోనూ 279 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అధిక్యంలో కొనసాగారు. రెండో రౌండ్‌లో బీజేపీకి 1,561 ఓట్లు రాగా టీఆర్ఎస్‌కు 1282 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 678 ఓట్లు వచ్చాయి. రౌండ్‌లో మొత్తం 7వేల 446 ఓట్లు పోలయ్యాయి. మొత్తం రెండో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 620 ఓట్ల అధిక్యాన్ని కనబరిచింది.

మూడో రౌండ్‌లోనూ బీజపీ ఆధిక్యంలో కొనసాగింది. దుబ్బాక ఉపఎన్నిక మూడో రౌండ్‌ల కౌంటింగ్‌ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్‌ రావు ఇప్పటిదాకా 1885 ఓట్ల ఆధిక్యం సాధించారు.

Tags:    

Similar News