దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. రౌండ్ రౌండ్‌కి ఓట్లు లెక్కింపులో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఏ రౌండ్‌లో ఎవరు ఆధిక్యంలోకి వస్తున్నారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగుతుంది. 11వ రౌండ్‌లో మళ్లీ బీజేపీ ఆధిక్యం కనబరిచింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 199 ఓట్ల ఆధిక్యం దక్కింది. 11 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ 3,933 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటి వరకు బీజేపీకి- 34,748, టీఆర్ఎస్‌కు-30,815, కాంగ్రెస్‌కు -8,582 ఓట్లు లభించాయి.
మొత్తం 23 రౌండ్లు ఉండగా.. ఇప్పటి వరకు 11 రౌండ్లు పూర్తయ్యాయి.. కీలకంగా ఉన్న కొన్ని మండలాల్లో ఇంకా ఓట్లు లెక్కించాల్సి ఉంది. దుబ్బాక గడ్డపై ఎవరి జెండా ఎగరనుందని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రౌండ్ రౌండ్‌కి సీన్ మారుతుండడంతో గెలుపు ధీమాలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో తన ప్రభావం చూపించలేక పోయింది. కనీసం డిపాజిట్‌లు కూడా రాబట్టలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే మూడో స్థానంలో కొనసాగుతోంది.