హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ వాసులు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయణించే అవకాశం త్వరలోనే కలగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కొత్త డబుల్ డెక్కర్ బస్సుల తయారీకి ఆర్డర్ కూడా ఇస్తున్నారు..

Update: 2020-12-16 07:23 GMT

హైదరాబాద్ వాసులు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయణించే అవకాశం త్వరలోనే కలగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కొత్త డబుల్ డెక్కర్ బస్సుల తయారీకి ఆర్డర్ కూడా ఇస్తున్నారు.. మొత్తం 5 ప్రధాన రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడపడానికి మార్గం సుగుమమైంది...మొదటి దశలో 40-50 బస్సులు తయారు చేయిస్తున్నట్లు మంత్రి పువ్వాడ వెల్లడించారు.... అన్ని సక్రమంగా జరిగితే కొద్ది నెలల్లోనే హైదరాబాద్ రొడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి...

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులపై గత నెలలో ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ బస్సులను మళ్లీ పరుగులు పెట్టించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అడిగారు. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తామన్న పువ్వాడ...దీనిపై నగరంలో సర్వే నిర్వహించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.

హైదరాబాద్ లోని వివిధ రూట్లలో సర్వే ఆర్టీసీ అధికారులు సర్వే నిర్వహించారు. మొదట్లో మాదిరిగా నగరంలోని అన్ని రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడపడం సాధ్యంకాదని అంచానా వేశారు. అనేక చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించడం, మెట్రో నిర్మాణమే ఇందుకు కారణం అని తేల్చారు.

ప్రస్తుతం నగరంలో ఐదు రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు వీలవుతుందని ఆర్టీసీ అధికారుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కోఠి నుంచి పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని భావిస్తున్నారు. కోఠి-పటాన్ చెరు, సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గాల్లో బస్సులు మంచి ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. దీంతో ఆ రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడిపేందుకు సరైనవని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ రూట్ లోని సుచిత్ర, కొంపల్లి వరకు బస్సులకు కూడా మంచి ఆక్యుపెన్సీ రేషియో ఉంది. ఈ మార్గంలోనూ డబుల్ డెక్కర్ బస్సులను నడిపితే బాగుంటుందని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.

హైదరాబాద్ లో 2004 వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు తీశాయి. వీటిని రద్దు చేసే సమయానికి మెహెదీపట్నం-సికింద్రాబాద్, మెహిదీపట్నం-చార్మినార్, సికింద్రాబాద్‌-చార్మినార్, సికింద్రాబాద్‌-జూపార్కు రూట్లలో నడిచాయి. మళ్లీ ఇప్పుడు పటాన్‌ చెరు మార్గంలోనే అత్యధిక డబుల్ డెక్కర్ బస్సులను నడపాలనే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. మొదటి దశలో 40-50 బస్సులు తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు.

మరికొద్ది నెలల్లో హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. 

Tags:    

Similar News