రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన జిల్లా అధికారి

* ఇంకా కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు

Update: 2022-11-12 06:01 GMT

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన జిల్లా అధికారి

Bribery Case: మెదక్‌లోని అద్దె ఇంట్లో రూ.10 లక్షలు దొరికినట్లు సమాచారం. 2014లో నిజామాబాద్‌లో పనిచేస్తున్నప్పుడూ ఏసీబీకి చిక్కిన గంగయ్య. రైతు నుంచి లంచం తీసుకుంటూ ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఏడీ ఏసీబీ చిక్కారు. ఓ రైతు నుంచి 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మెదక్ కలెక్టరేట్‌లోని ల్యాండ్ అండ్ సర్వే ఆఫీస్‌లోనూ ఏసీబీ సోదాలు జరుపుతున్నారు. కాగా మెదక్‌లో గంగయ్య ఉంటున్న కిరాయి ఇంట్లో హైదరాబాద్ బీరంగూడలోని సొంత ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు అయితే మెదక్‌లోని అద్దె ఇంట్లో 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.. కగా 2014లో నిజామాబాద్‌లో గంగయ్య ఏడీగా పనిచేస్తున్నప్పుడూ ఏసీబీకి చిక్కారు. 

Tags:    

Similar News