Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వేగవంతం

Disha Encounter Case: 21న విచారణకు హాజరుకావాలని ప్రభుత్వానికి కమిషన్ ఆదేశం, 26, 27, 28 తేదీల్లో 18మంది సాక్షుల విచారణ

Update: 2021-08-19 04:20 GMT

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ వేగవంతం

Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణను త్రిసభ్య కమిషన్‌ వేగవంతం చేసింది. ఈనెల 21న ఆధారాలతో విచారణకు హాజరు కావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు 26, 27, 28 తేదీల్లో 18మంది సాక్షులను కమిషన్‌ విచారించనున్నారు. ఈ విచారణను త్రిసభ్య కమిషన్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనుంది. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ప్రభుత్వం తరఫు న్యాయవాదితో పాటు సాక్షులు విచారణకు హాజరుకానున్నారు.

దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రులతో పాటు, మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు 2019 డిసెంబర్‌లో త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా విచారణ ఆలస్యమైంది. దిశ త్రిసభ్య కమిషన్‌ ఇప్పటి వరకు ప్రజల నుంచి 1333 అఫిడవిట్లు, వైద్యుల నుంచి 103 అఫిడవిట్లు స్వీకరించింది. పోలీసులు, ప్రభుత్వం, సాక్షులను విచారించింది. మరోవైపు 16 సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. మెడికల్, ఫోరెన్సిక్, బాలిస్టిక్ రికార్డులు, రిపోర్టులు, సిట్, సీడీఆర్ దర్యాప్తు రికార్డులను పరిశీలించింది.

Tags:    

Similar News