హైదరాబాద్ పరిసరాల్లో దగ్గు, జలుబు, జ్వరాలతో ఇబ్బంది
* శీతాకాలం ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది
Hyderabad: శీతాకాలం ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. నిన్న మొన్నటిదాకా మంచు ప్రభావంతో ఉన్న హైదరాబాద్ పరిసరాలు, మండూస్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో ప్రజారోగ్యంపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. వాతావరణంలో మార్పులు, తాగునీటిలో కాలుష్యం వెరసి జ్వరాలతో బాధపడే వారిసంఖ్య అమాంతంగా పెరిగింది. హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందేవారు క్రమేణ పెరిగారు.
హైదరాబాద్ పరిసరాల్లో దగ్గు, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరాల తీవ్రతతో చికిత్స పొందుతున్న వారిలో వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా పేషంట్లు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ సూచించారు. బయట తిరిగేవాళ్లు మాస్కులు వినియోగించడంవల్ల ప్రయోజనకరంగా ఉంటుందని, వీలైనంతమేరకు వేడినీళ్ల తాగేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.