Warangal: ఆకట్టుకుంటున్న వెరైటీ వినాయకులు
Warangal: వరంగల్‌లో ఘనంగా గణపతి నవరాత్రోత్సవాలు
Warangal: వరంగల్‌లో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో చోట ఒక్కో రూపంలో దర్శనమిస్తున్న వినాయకులను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వినాయక మండపాలను ఒక్కో చోట ఒక్కో తరహాలో తీర్చిదిద్దారు. వరంగల్ చౌరస్తా గీతాభవన్ వద్ద 200 కిలోల ఎండు మిర్చితో గణపతిని రూపొందించారు. రామన్నపేటలో నెమలి పించాల గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మొత్తం 2500 నెమలి ఈకలతో ఈ గణపతిని రూపొందించారు. శివనగర్‌లో గణపతిని ఎత్తుకుని ఉన్న మోడీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డికాలనీలో ఏర్పాటు చేసిన రైతు గణపతి అత్యంత ఆకర్షణీయంగా సందేశాత్మకంగా ఉంది.