Ponguleti Srinivas: ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం

Ponguleti Srinivas: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్, విద్యుత్, ఆర్థిక రంగాలపై శ్వేత పత్రాలను విడుదల చేసింది

Update: 2024-02-26 12:00 GMT

Ponguleti Srinivas: ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం

Ponguleti Srinivas: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్, విద్యుత్, ఆర్థిక రంగాలపై శ్వేత పత్రాలను విడుదల చేసింది. ఇక ధరణి పోర్టల్‌పై సైతం శ్వేత పత్రం విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిలోని లోటుపాట్లపై కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పొంగులేటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి వెల్లడించారు. ధరణి సమస్యల పరిష్కారానికి సైతం మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామన్నారు. ధరణి దరఖాస్తుల ఆధారంగా శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది..

Tags:    

Similar News