నేడు ధరణి కమిటీ మరో కీలక సమావేశం
Dharani: మూడు ప్రభుత్వ శాఖలతో భేటీకానున్న కమిటీ
Dharani: ధరణి పోర్టల్ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. మూడు ప్రభుత్వ శాఖలతో ధరణి కమిటీ భేటీ కానుంది. వ్యవసాయ, గిరిజన, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించనుంది ధరణి కమిటీ. ఈ భేటీలో రైతు భరోసా, భూ హద్దులు, పోడు పట్టాలపై చర్చించనున్నారు.