వేములవాడకు పోటెత్తిన భక్తులు!
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. సోమవారం నాడు కార్తీక పౌర్ణమి రావడంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. సోమవారం నాడు కార్తీక పౌర్ణమి రావడంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగానే హరిహర క్షేత్రమైన వేములవాడ పార్వతీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. అక్కడ భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకుని తన్మయత్వం చెందారు. ఉదయం స్వామివారికి 11 మంది అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఇక రాత్రి 7.30 గంటలకు ఆలయం ముందుభాగంలో అర్చకుల వేదమంత్రాల మధ్య జ్వాలాతోరన కార్యక్రమం నేత్ర పర్వంగా నిర్వహించబడుతుంది. రాత్రి 10 గంటలకు స్వామివారికి మహాపూజ ఘనంగా నిర్వహిస్తారు. అటు కోవిడ్–19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.