Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు

ఎండ ఉక్కపోతకు అస్వస్తతకు గురవుతున్న భక్తులు

Update: 2024-05-26 06:24 GMT

Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Yadadri: సెలవురోజు కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్‌లో భక్తులు కిక్కిరిసిపోయారు. ఉదయం నుంచే భక్తులు అధికసంఖ్యలో రావడంతో.. యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. క్యూలైన్లో ఏసీలు పనిచేయకపోవడంతో.. ఓ భక్తుడు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అతన్ని ఆలయ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

గత మూడు రోజులుగా యాదాద్రిలో అధిక ఉ‌ష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు తెల్లవారుజామునుంచే తరలివస్తున్నారు. కొండపైన ఏర్పాటు చేసిన క్యూలైన్లో ఏసీలు పనిచేయకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ‌్యంగా క్యూలైన్ హాల్‌‌లో భక్తులను అధికంగా పంపించడం.. హాల్ నిర్మాణం పై కప్పు దగ్గరగా ఉండటం.. ఎండ తీవ్రత గణనీయంగా ఉండటంతో భక్తులు అస్వస్తతతకు గురవుతున్నారు.

గతంలో ఎండాకాలంలో.. భక్తుల కోసం కనీసం కార్పేట్ కూడా వేయలేదని.. ఎండకు దర్శనం చేసుకోవడానికి క్యూలైన్ లో వెళ్లడానికి కూడా భక్తులు భయపడేపరిస్థితి నెలకొందని విమర్శలు వచ్చాయి.. భక్తుల నుంచి అనేక సమస్యలు విన్నవించినా... అధికారుల మాత్రం స్పందించడంలో.. అలసత్వం వహిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. దర్శనానికి వస్తున్న భక్తులకు ఏర్పాట్లు కల్పించడంలోనూ.. అధికారులు తీరుపై విమర్శలు అధికమవుతున్నాయి. 

Tags:    

Similar News