Nirmal District News: నిర్మల్‌ జిల్లాలో డెంగ్యూ పంజా

Nirmal District News: జిల్లా కేంద్రంలో 40 డెంగ్యూ, 250 వైరల్‌ జ్వరాల కేసులు, వర్షాల కారణంగా నిండిన కాలువలు, ఖాళీస్థలాలు

Update: 2021-08-11 10:51 GMT

Nirmal District News: నిర్మల్‌ జిల్లాలో డెంగ్యూ పంజా

Nirmal District News: నిర్మల్‌ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతోంది. ఖానాపూర్‌, భైంసా లాంటి నగరాల్లో డెంగ్యూ కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తోంది. అదేవిధంగా సీజనల్‌ వ్యాధులు సైతం విస్తరిస్తుండటం భయాందోళన కల్గిస్తోంది. ఇక ఇప్పటివరకు వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం 40 డెంగ్యూ కేసులు నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 250 వైరల్‌ జర్వాలు కూడా రికార్డయినట్లు వైద్యారోగ్యశాఖ తెలియజేసింది.

ప్రధానంగా సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో దోమలు, ఇతర వైరస్‌లు విస్తరిస్తున్నాయి. దీనికితోడు గతనెలలో కురిసిన వర్షాల కారణంగా మురికికాలువలు, ఖాళీస్థలాలన్నీ నిండిపోగా దోమల బెడత విపరీతంగా పెరిగిందంటున్నారు ప్రజలు. అటు దోమల నివారణకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది.

Tags:    

Similar News