Warangal: వరంగల్ బీఆర్ఎస్‌లో వర్గపోరు.. టికెట్ రాజయ్యకే ఇవ్వాలని డిమాండ్
Warangal: హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయింపు
Warangal: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. స్టేషన్ ఘన్‌పూర్ , జనగామ నియోజకవర్గా్లలో సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతవుతాయనే ప్రచారంతో ఎమ్మెల్యేల అనుచరులు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పల్లాకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. జనగామలో పల్లా గో బ్యాక్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పల్లా దిష్టిబొమ్మ దగ్ధానికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. కడియం వ్యాఖ్యలకు నిరసనగా వేలేరు మండల కేంద్రంలో రాజయ్య వర్గీయులు ర్యాలీ నిర్వహించారు. కడియం వద్దు... రాజయ్య ముద్దు అంటూ నేతలు నినాదాలు చేశారు. కడియం దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారులు ధర్నాకు దిగారు. హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ టికెట్ రాజయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.