ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఎవరినోట విన్నా ఆదే మాట వినిపిస్తోంది. నలుగురు ఉన్న చోట దాని గుర్తించే చర్చ జరుగుతోంది. బంధువులకు ఫోన్లు చేసి మరీ వాటిని తెప్పించుకుంటున్నారు. పాడుపడ్డ వస్తువుల కోసం ఊరువాడలా అన్వేషిస్తున్నారు. మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా ఉంటే వాటికి లక్ష రూపాయలు ఇస్తామంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఏళ్ల కింద మూలన పడేసిన వాటిని దుమ్ము దులిపి మరీ పక్కన పెడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుప్త నిధుల వేట జోరుగా సాగుతోంది. పాడు పడ్డ రాజుల కోటలు, పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం కేటుగాళ్లు భారీగా తవ్వకాలకు పాల్పపడుతున్నారు. రాజుల కోటలు, సైనిక స్థావరాలు, చారిత్రక ప్రసిద్ది పోందిన ఆలయాలల్లో భారీ తవ్వకాలు చేస్తున్నారు. గుప్తనిధుల కోసం అక్రమార్కులు టెక్నాలజీని ఉపయోగించే పనిలో పడ్డారు. పాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు, రేడియోల కోసం లక్షలు ఇస్తామంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ ముఠా తిరగుతుండడంతో జనం అయోమయంలో పడ్డారు. మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా ఉంటే వాటికి లక్ష రూపాయలు ఇస్తామంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ఏళ్ల కింద మూలన పడేసిన టీవీ, రేడియోలకి లక్షలు వస్తాయని దుమ్ము దులిపి మరీ పక్కన పెడుతున్నారు. ఇంకొందరు తమ చుట్టాలకు ఫోన్లు చేసి మరీ పాత టీవీలు, రేడియోలు తెప్పించుకుంటున్నారు. టీవీలు రిపేర్ చేసే షాపుల వారికైతే తాకిడి మరీ ఎక్కువైంది. పాత తరం టీవీలు రేడియోల్లో ఉన్నా వాల్వ్, కాయిల్స్ గుప్త నిధులను గుర్తిస్థాయని ప్రచారం చేస్తున్నారు. రెండు మూడు ఇంచులు ఉండే రెడ్ కలర్ వాల్వ్ మెటల్ ని బాగా గుర్తిస్తుందన్న ప్రచారం ఎక్కువ కావడంతో వాటికోసం వేట మొదలైంది. అయితే ఇలాంటి వాల్వ్ లను తామెప్పుడు చూడలేదని మెకానిక్ లు చెబుతున్నారు.
అయితే, ఇదంతా ఫేక్ అనీ నమ్మితే అసలుకే మోసం వస్తుందని కొందరు సూచిస్తున్నారు. మాయమాటలు చెప్పి మోసం చేసే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా కేటుగాళ్ల పుకార్లతో పాత టీవీలు, రేడియోల కోసం జరుగుతున్న వెతుకులాట చైన్ సిస్టంలా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఎవరినోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది.