Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi Liquor Scam: లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.

Update: 2024-05-10 06:56 GMT

Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi Liquor Scam: లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కవిత అరెస్టుపై ఈడీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ నెల 24న సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనపై నమోదయిన మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఆమె తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ ఎందుకు రావడం లేదు?


Tags:    

Similar News