నవంబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు..కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోనూ కసరత్తు

Update: 2020-09-23 00:55 GMT

వేసవి సెలవులు ముగియగానే మొదలు కావలసిన విద్యాసంవత్సరం ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. అంతే కాక అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు డిగ్రీలో అడ్మిషన్లు పొందేందుకు దోస్త్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది.

ఇకపోతే వివిధ డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్‌ వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్ధులకు ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్‌ తరగతులను నవంబర్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో డిగ్రీ, పీజీ తరగతులను అదే రోజు నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అదే విధానాన్ని అనుసరిస్తూ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టా లనుకుంటోంది. అలా తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ అధికారులు వచ్చే నెల 31వరకు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల ప్రవేశాలను పూర్తి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగానే ఈ నెల 21న డిగ్రీ మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించింది.

ఇక వచ్చే నెల 10లోగా రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌ను కూడా నిర్వహించాలని, 15వ తేదీలోగా విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక పోతే ప్రభుత్వం ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించింది. కాగా వాటి ఫలితాలను విడుదల చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి 19 రకాల పీజీ కోర్సులకూ ఈ నెల 21 నుంచి 24 నుంచి ప్రవేశపరీక్షలను నిర్వహిస్తోంది. అదే విధంగా ఈ నెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఆయా పరీక్షలు పూర్తవగానే వచ్చే నెల పీజీ ప్రవేశాలను కూడా చేపట్టి పూర్తి చేయనుంది.

ఇక పోతే ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియను ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు చేప‌ట్ట‌ింది. దీంతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు దోస్త్ నోటిఫికేషన్ లో దరఖాస్తులు చేసుకన్నారు. కాగా తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్‌-2020లో భాగంగా మొదటి దశ సీట్లను కేటాయించింది. రాష్ట్రంలో 1,71,275 మంది విద్యార్థులు దోస్త్‌లో నమోదు చేసుకున్నారని, వారలో 1,41,340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లను కేటాయించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ను సెప్టెంబ‌రు 26 వరకు చేయాలని సూచించారు.

Tags:    

Similar News