Dasara Holidays 2023: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు.. ఎన్ని రోజులంటే?

Dussehra Holidays 2023: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు ఈ సారి భారీ సంఖ్యలో దసరా సెలవులు రానున్నాయి.

Update: 2023-10-04 08:37 GMT

Dasara Holidays 2023: ఈనెల 13 నుంచి స్కూళ్లకు బతుకమ్మ, దసరా సెలవులు.. ఎన్ని రోజులంటే?

Dussehra Holidays 2023: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు ఈ సారి భారీ సంఖ్యలో దసరా సెలవులు రానున్నాయి. తెలంగాణలో అన్ని పండగల్లో అత్యంత ముఖ్యమైన పండగ దసరా. ఈ పండగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దసరాను జరుపుకుంటారు. దసరాతో పాటు బతుకమ్మను అంతే ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ముందుగానే సెలవు ప్రకటిస్తుంది.

రాష్ట్రంలోని విద్యాసంస్థలకు బతుకమ్మ, దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది.

Tags:    

Similar News