Darbhanga Blast: హైదరాబాద్‌ కేంద్రంగా దర్భంగా కేసు విచారణ

Darbhanga Blast: ఉగ్రవాదులు ఇమ్రాన్‌ మాలిక్‌, నాసిర్‌ మాలిక్‌,.. * హామీ సలీం, ఖాఫిల్‌ను కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ

Update: 2021-07-06 06:00 GMT
ఎన్ఐఏ విచారణ (ఫైల్ ఇమేజ్)

Darbhanga Blast: హైదరాబాద్‌ కేంద్రంగా దర్భంగా పేలుడు కేసు విచారణ జరుగుతోంది. ఉగ్రవాదులు ఇమ్రాన్‌ మాలిక్‌, నాసిర్‌ మాలిక్‌, హామీ సలీం, ఖాఫిల్‌ను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈ నెల 9 వరకు ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతివ్వడంతో.. ఢిల్లీ ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా బాంబు తయారు చేసిన నేపథ్యంలో.. అక్కడి నుంచే ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. 

లష్కరే తోయిబా ఉగ్రవాదులైన మాలిక్‌ బ్రదర్స్‌ను భారీ భద్రత మధ్య హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. మాదాపూర్‌ ఎన్‌ఐఏ ఆఫీస్‌కు నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ను తరలించిన ఎన్‌ఐఏ.. ఈ రాత్రికి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనుంది. అలాగే.. పార్శిల్‌ బుకింగ్‌ ఎలా జరిగింది..? ఐఈడీ తయారీకి కావాల్సిన ముడి సరుకులను ఎక్కడ కొన్నారు..? దీంట్లో ఎంకెవరెవరు ఇన్వాల్వ్‌ అయి ఉన్నరనేదానిపై దర్యాప్తు చేయనుంది ఎన్‌ఐఏ.

Tags:    

Similar News