Hyderabad: హైదరాబాద్ జగద్గిరిగుట్టలో గాలివాన బీభత్సం
Hyderabad: శ్రీనివాస్‌నగర్ కాలనీకి వెళ్లే రోడ్డుపై కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
Hyderabad: హైదరాబాద్ జగద్గిరిగుట్ట నుండి శ్రీనివాస్‌నగర్ కాలనీకి వెళ్లే రోడ్డుపై రెండు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే కరెంట్ ఆఫీస్ ముందు పడిపోయిన స్తంభాన్ని... రాత్రి నుండి అధికారులు పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. రోడ్డుపై కరెంటు తీగలు పడి ఉండడంతో అటువైపుగా వెళ్తున్న జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు.