Cycling Tracks In Hyderabad City : నగరంలో కొత్త హంగులు..ఏర్పాటు కానున్న సైకిల్ ట్రాక్ లు

Cycling Tracks In Hyderabad City : ఒకప్పటి కాలంలో బండ్లు, కార్లు, స్కూటర్లు ఇవేమి లేకపోవడంతో చాలా మంది ప్రజలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సైకిల్ల మీద ప్రయాణం చేసి వెళ్లేవారు.

Update: 2020-09-06 05:36 GMT

ప్రతీకాత్మక చిత్రం 

Cycling Tracks In Hyderabad City : ఒకప్పటి కాలంలో బండ్లు, కార్లు, స్కూటర్లు ఇవేమి లేకపోవడంతో చాలా మంది ప్రజలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సైకిల్ల మీద ప్రయాణం చేసి వెళ్లేవారు. కాలక్రమేనా వాహనాలు పెరగడంతో సైకిల్లు మూలన పడ్డాయి. అయినా కొంత మంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేస్తూ అందులో భాగంగా సైక్లింగ్ ను కూడా చేస్తుంటారు. అలా సైకిల్ పైన ఓ కిలోమీటర్ అయినా వెళ్తే ఆ ఆహ్లాదమే వేరుగా ఉంటుంది. గ్రామాల్లో, పెల్లెల్లో బయటి గాలికి సైక్లింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే పట్టణ ప్రజలు మాత్రం ఒక గదిలో సైక్లింగ్ చేస్తూ ఉండిపోతుంది. దీంతో రోడ్లపై సైకిల్లలో వెళ్లాలనే వారి కోరికలు రోడ్లపై ఉండే ట్రాఫిక్ కారణంగా కలగానే మిగిలిపోతున్నాయి. అయితే ఈ కలను నిజం చేసేందుకు జీహెచ్ఎంసీ ఓ ఉపాయాన్ని ఆలోచించింది. హైదరాబాద్ వాసుల కోసం త్వరలోనే సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయనుంది. యాంత్రీక జీవనం నుంచి ప్రజలకు కాస్త బయటికి వచ్చి ఊరట పొందేందుకు, మానసికంగా ఆటవిడుపు అందించడంతో పాటు శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు, మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నుంచి బయట పడేందుకు అధికారులు సైకిల్‌ ట్రాక్ ఏర్పాటుకు చేయనున్నారు.

ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీలో పైలెట్‌ ప్రాజెక్టుగా బేగంపేట మెట్రోస్టేషన్‌ నుంచి సైఫాబాద్‌ ఎక్బాల్‌ మినార్‌ వరకు 12.3 కిలోమీటర్ల మేర(వన్‌ వే) సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(హెచ్‌ఎంటీఏ) రానున్న రెండు, మూడేళ్లలో దశలవారీగా నగరంలో 450 కి.మీ. మేర సైకిల్‌ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్, కోకాపేట, ఖైరతాబాద్, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 95 నగరాలు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సైకిల్‌ ఫర్‌ ఛేంజ్‌' ఛాలెంజ్‌కు ఎంపికయ్యాయి. ఈ నగరాల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌కు చోటు దక్కించుకుంది.

రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ మహానగరంలో ప్రజల దైనందిక జీవనంకోసం సైకిల్‌ ట్రాక్‌ నిర్మించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు అవుటర్‌ రింగ్‌రోడ్‌ వద్ద 25 కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసి, వంద రోజుల ప్రణాళికలో చేర్చింది. అంతే కాదు నగరంలోని ఖైరతాబాద్‌ జోన్‌లో మొత్తం ఎనిమిది రహదారులను సైకిల్‌ ట్రాక్‌లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు.

Tags:    

Similar News