తప్పెవరిది? రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉంటె తప్పదు ప్రమాదం!
* ఒక్కసారిగా రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చిన బాలుడు * తల్లి చేయి వదిలి రోడ్డుపైకి వెళ్లిన బాలుడు * బైక్ పై ఉన్న వ్యక్తి సమయస్పూర్తితో తప్పిన పెను ప్రమాదం
చిన్నపిల్లలతో రోడ్డుపై వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం అని చెప్తున్నా.. అదే నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. హైదరాబాద్ లో ఒక తల్లి నిర్లక్ష్యంతో బాబుకు ప్రమాదం జరిగింది. బాలానగర్ బీబీఆర్ హాస్పిటల్ ఎదురుగా పీజేఆర్ స్టాచ్యూ దగ్గర.. తల్లి, కొడుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో బాబు తల్లి చేయి వదలిపెట్టి.. ఒక్కసారిగా రోడ్డుపైకి పరిగెత్తాడు. అటువైపుగా వస్తున్నబైక్ కింద బాబు పడ్డాడు..
ఇది ఊహించని బైక్ పై ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దాంతో అతడు కూడా కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ లో పెట్టారు. ఇందులో తప్పెవరిది అని ట్యాగ్ లైన్ జోడించింది. అయితే.. చాలా మంది నెటిజన్లు తల్లి నిర్లక్ష్యమే కారణమని బదులు ఇచ్చారు.
ఈ వీడియో మీరూ చూడండి.. తప్పెవరిదో చెప్పండి..