CP Sajjanar about Plasma Donations: ప్లాస్మా డొనేషన్ కోసం సైబరాబాద్‌ పోలీసుల వినూత్న ప్రయత్నం

CP Sajjanar about Plasma Donations కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది..

Update: 2020-07-24 16:03 GMT
cp sajjanar(File Photo)

CP Sajjanar about Plasma Donations: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక భారత్ లో అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కొంచం ఆశాజనకంగా కనిపిస్తుంది.. ఇక అటు ఈ కరోనాకి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో నిమగ్నం అయి ఉన్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు..

ఇక కొవిడ్ కి చికిత్స నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన పేషెంట్స్ తప్పనిసరిగా తమ ప్లాస్మాను దానం చేసి సాటి మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చాలా మంది చెబుతున్నారు.. ప్లాస్మా డొనేషన్ కోసంఎదురుచూస్తున్న చాలా మంది కరోనా బాధితులకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాస్మా డొనేషన్ ని ఎంకరేజ్ చేసి చికిత్సనుఅందిస్తున్నాయి. దీనిపైన హైదరాబాదు పోలీసులు కూడా తమవంతుగా ప్రచారం చేస్తున్నారు.

అందులో భాగంగా కరోనా వైరస్‌ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించే పనిలో పడ్డారు సైబరాబాద్‌ పోలీసులు.. వారి ప్రయత్నానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. గత రెండు, మూడు రోజుల్లోనే 27 మంది ప్లాస్మా దానం చేసినట్టుగా సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇందుకోసం donateplasma.scsc.in వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్టుగా అయన వెల్లడించారు. ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమేనని, ఆసక్తి ఉన్నవారు 94906 17440ను సంప్రదించొచ్చు అని అయన సూచించారు. అంతేకాకుండా ప్లాస్మా ఇచ్చే వాళ్లను సమన్వయం చేయడానికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారయన..

అటు తెలంగాణలో రాష్ట్రములో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,826 కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 11,052 యాక్టివ్ కేసులు ఉండగా, 39,327 కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో పోరాడి 447 మంది మృతి చెందారు.  

Tags:    

Similar News