షాదీ ముబారక్ స్కీమ్ డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు..

Update: 2020-08-22 12:00 GMT

Cyber Criminals loots Shaadi Mubarak scheme money: షాదీ ముబారక్‌ స్కీం డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేశారు. రూ.లక్ష చెక్కును కేటుగాళ్లు డ్రా చేశారు. చాంద్రాయణగుట్టకు చెందిన బాధితుడు ఈ ఏడాది జనవరిలో తన కుమార్తెకు వివాహం చేశాడు. నిరుపేద కావడంతో షాదీ ముబారక్‌ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరు కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న బండ్లగూడ రెవెన్యూ అధికారులు చెక్కు అందించారు. దీన్ని బాధితుడు బ్యాంకులో డిపాజిట్‌ చేసినా ఎన్‌క్యాష్‌ కాలేదు.

ఆరా తీయగా జనవరిలోనే ఈ చెక్కు తమిళనాడులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో ఎన్‌క్యాష్‌ (డబ్బు డ్రా ) అయినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు బాధితుడు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు.




Tags:    

Similar News