రైతులకు బిగ్ అలర్ట్.. రుణమాఫీ పేరుతో మెసేజ్‌లు.. క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ..

Raithu Runamafi: తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది.

Update: 2024-07-19 04:50 GMT

 Telangana Budget: భూమిలేని రైతుకూలీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. ఏడాదికి 12వేల ఆర్థిక సాయం

Raithu Runamafi: తెలంగాణలో రైతు రుణమాఫీ అంశం ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేసిది. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ పేరుతో అమాయకపు రైతులను బురిడీ కొట్టించే ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించింది. రుణమాఫీనే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రుణమాఫీ పట్ల బ్యాంకు లోగోతో వచ్చిన ఏ ఏపీకే ఫైల్స్ ను ఇన్‌స్టాల్‌ ఓపెన్ చేయొద్దు షేర్ చేయొద్దని రైతులకు సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో రైతులతో మాట్లాడి రుణమాఫీని ప్రారంభించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రస్తుతం తొలి విడతలో లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ అవుతున్నాయి. 11 లక్షల మంది రైతులకు దాదాపు 6 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు జమ అయ్యాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న సాయంత్రం 4 తర్వాత అర్హులైన రైతుల ఫోన్లకు మాఫీ మెసేజ్‌లు వెళ్లాయి.

రైతు రుణమాఫీ కావడంతో తెలంగాణ పోలీసులు రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, బ్యాంకు లోగోతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫైల్స్ యాక్సెప్ట్ చేయటం ద్వారా మన వాట్సాప్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోతుందని అంటున్నారు. అలా చేయటం వల్ల మన కాంటాక్ట్‌స్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని.. దీని ద్వారా సైబర్ నేరస్థులు నేరాలు చేస్తారని హెచ్చరిస్తున్నారు. మన గూగుల్ పే, ఫోన్‌ పే, యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు దోచేస్తారని అంటున్నారు.

తెలంగాణలో రైతు రుణమాఫీ మూడు విడతల్లో మాఫీ చేయనున్న నేపథ్యంలో రైతులు అలర్ట్‌గా ఉండాలని, బ్యాంకర్లు ప్రభుత్వం సూచించిన విధంగానే రుణమాఫీ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకు లోగోలతో వచ్చే ఏపీకె ఫైల్స్ ఓపెన్ ఇన్‌స్టాల్‌ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అత్యాశకు పోయి ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే మాత్రం మీరే కాదు మీ సన్నిహితులకు గ్రూప్ సభ్యులకు ఈ ఫైల్ షేర్ అవుతుందని తద్వారా మీ ద్వారా చాలామంది బాధితులు సైబర్ నేరాలకు గురవుతారని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లేక సైబర్ క్రైమ్ లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించగలరని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరానికి గురైతే త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే జీరో అవర్ ద్వారా మీ డబ్బు సులభంగా మళ్లీ తిరిగి పొందవచ్చునని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News