ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో షకీల్ పేరు నమోదు
Shakil Aamir Bodhan: సోహెల్‌ను దుబాయ్ నుంచి రప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు
Shakil Aamir Bodhan: బేగంపేట్‌లోని ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎఫ్‌ఐఆర్‌లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును చేర్చారు పోలీసులు. ప్రమాదం తర్వాత దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించిన సోహెల్‌కు 10 మంది సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సోహెల్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరో వైపు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు సోహెల్. సోహెల్‌ను దుబాయ్ నుంచి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.