ఇంట్లో మొసలి..వీధిలో ప్రజలు..

సాధారణంగా ఇండ్లలోకి బల్లులు, పిల్లులు, కుక్కలు వస్తుండడం సహజం.

Update: 2019-12-28 03:45 GMT
మొసలి

సాధారణంగా ఇండ్లలోకి బల్లులు, పిల్లులు, కుక్కలు వస్తుండడం సహజం. ఇవి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు జెర్రులు, పాములు లాంటి విషప్రాణులు కాలనీలలో, ఇండ్లలోకి వస్తుంటాయి. ఆ విషపురుగులు కనిపిస్తేనే చాలు ప్రజలు హడలెత్తి పోయి పరుగులు తీస్తారు. అలాంటిది ఏకంగా మనుషులను మింగే ప్రాణులే ఇండ్లలోకి వస్తే అప్పుడు వారి పరిస్థితి ఏంటి. వారు ఎంతటి భయాందోళనలకు గురవుతారు. ఆలోచిస్తుంటేనే ఒక్కసారిగా భయం వేస్తుంది కదూ.. ఇక నేరుగా ఆ పరిస్థిని ఎదుర్కొన్న వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు ఏంటి ఏ ప్రాణి, ఎవరి ఇంట్లోకి చొరబడింది అనుకుంటున్నారా. ఒకే అసలు విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డు నుంచి దాదాపు 100 అడుగుల దూరంలో ధర్మశాల అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఈ ప్రాంతం నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్క చాలా మంది చేపల వేటనే వారి వృత్తిగా ఎంచుకున్నారు. ఇదే గ్రామంలో గిరీష్‌జోషి అనే అర్చకుడు ఉన్నాడు. అతను రోజులాగానే ఈ శుక్రవారం కూడా ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. అతను బయటికి రాగానే సడంగా అతని ఇంటి ఆవరణలో ఓ మూలన మొసలిని చూసాడు. అంతే ఇంకేముంది ఇక్క సారిగా ఆయన, ఆయన కుటుంసభ్యలు భయబ్రాంతులకు గురయ్యారు.

అందరినీ పిలిచి విషయాన్ని తెలిపారు. అది చూసిన ఆ ప్రాంత ప్రజలు కూడా కొంత మేరకు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంకా మొసలిని ఆ ప్రాంతంలో సంచరివ్వనిస్తే ఎవరికైనా అపాయం కలిగిస్తుందేమోనని భావించిన కొంత మంది మత్సకారు ఆ మొసలిని చాకచక్యంగా పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలోని కొంత మంది వ్యక్తులు చేపలు పట్టడంలో దిట్ట కవాడంతో వారు సులభంగా ఈ పనిని చేయగలిగారు.

ఇక మొసలిని పట్టుకున్న వారు వెంటనే ఫారెస్ట్ అధికారలకు సమాచారం అందించడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే మొసలిని మొసలిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పోతే ఇలా నీటిని వదిలి మొసళ్లు, విషపురుగులు జనవాసాల్లోకి రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News