ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు పార్టీల మద్దతు

Update: 2021-01-25 08:30 GMT

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులకు మద్దతుగా తెలంగాణలో బీజేపేతర పార్టీలన్నీ ఏకమయ్యాయి. చట్టాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌లో కూడా ర్యాలీ చేపట్టాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో ట్రాక్టర్, కారు, మోటారు వాహనాలతో ర్యాలీ నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.


Tags:    

Similar News