రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా

Update: 2021-02-28 08:01 GMT

రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా

రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కొవిడ్‌ టీకా అందిస్తున్నట్టు డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్‌ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రంలో కొవిడ్‌ టీకా తీసుకోవచ్చని చెప్పారు. ప్రతి జిల్లాలో 2, హైదరాబాద్‌లోని 12 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని, వృద్దుల కోసం వీలైనంత వరకు వీల్‌చైర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News