ప్రేమ, పెళ్లి పేరుతో రూ. 85 లక్షల మోసం.. దంపతుల అరెస్ట్
Hyderabad: ఫేస్ బుక్ లో ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి విడతల వారీగా సొమ్ము కాజేసిన కిలాడీ దంపతులను సికింద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.
Hyderabad: ఫేస్ బుక్ లో ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి విడతల వారీగా సొమ్ము కాజేసిన కిలాడీ దంపతులను సికింద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఎర్రగుండ్ల దాసు అనే వ్యక్తి జ్యోతి అనే పేరుతో ఫేస్ బుక్ ఎక్కౌంట్ ఓపెన్ చేశాడు. ఆపై సికింద్రాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. నెమ్మదిగా వారిద్దరి మధ్య పరిచయం, స్నేహానికి దారి తీసింది. ఆపై ప్రేమ, పెళ్లి అంటూ మాయ మాటలు చెప్పాడు ఎర్రగుండ్ల దాసు.
తన వాటా ఆస్తిని రాబట్టుకోడానికి కొంత ఖర్చు పెట్టాల్సి ఉందంటూ నమ్మించి విడతల వారీగా 85 లక్షలు బాధితుని దగ్గర వసూలు చేశాడు. తొందరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించాడు జ్యోతి పేరుతో చేసిన ఈచాటింగ్ ను నమ్మిన ఇంజనీర్ అడిగినంత సాయం చేశాడు. ఆపై సడెన్ గా ఫోన్ స్విచాఫ్ చేసి, ఫేస్ బుక్ ఎక్కౌంట్ బ్లాక్ చేయడంతో బాధితుడు సికింద్రాబాద్ సైబర్ సెల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.