Cotton Price Per Quintal: మార్కెట్లకు పోటెత్తుతున్న పత్తి

Warangal Market Cotton Rate Today: *మంగళవారం గరిష్ఠ ధర రూ.7,960 *తేమ ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్న వ్యాపారులు

Update: 2021-10-27 06:36 GMT

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Cotton Price Per Quintal: మార్కెట్లకు పత్తి పోటెత్తుతోంది. మొదటి దశ పత్తి చేతికి రావడంతో రైతులు తెంపుతున్నారు. ఈ క్రమంలో CCI కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఏనుమాముల మార్కెట్, పరకాల, కేసముద్రం, జనగామ మార్కెట్లకు పత్తి భారీగా వస్తోంది.

రాత్రి నుంచే పత్తి లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు బారులుదీరుతున్నాయి. మార్కెట్లలో ఎటుచూసినా పత్తి బేరళ్లే దర్శనమిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా భావించిన పత్తి వ్యాపారులు రింగ్‌ అవుతున్నారు. తరుగు, తేమ తదితర సాకులు చూపుతూ మద్దతు ధరకు కోత పెడుతున్నారు.

కరోనా తర్వాత పత్తి నిల్వలు లేకపోవడంతో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. ఒక్కసారిగా టెక్స్‌టైల్స్, ఇతర పరిశ్రమలు పునఃప్రారంభమయ్యాయి. ఇప్పుడు పత్తి చాలా అవసరం. దీంతో వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం అత్యధికంగా క్వింటాల్ ధర 7వేల 960 రూపాయలు పలికింది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర కూడా బాగానే ఉంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఒక్కో పత్తి బేల్‌కు 40వేల పైచిలుకు ధర పలుకుతోంది.

ఇంత వరకు పర్వాలేదు. అసలు సమస్య ఇక్కడే ఉంది. గతం కంటే పత్తి దిగుబడి చాలా తగింది. పెట్టుబడులు కూడా చాలా ఎక్కువ పెట్టామని ఇన్ని ఖర్చులు భరించుకుంటూ తీరా మార్కెట్‌కు వస్తే ఇక్కడ తేమ పేరుతో కొంతమంది వ్యాపారాలు రేటులో కోత పెడుతున్నారని ఆవేదన వేక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా పత్తి రైతులు. అయితే దిగుబడి బాగా తగ్గడం, పెట్టుబడులు కూడా ఎక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News