రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా ఢిల్లీలోని మర్కజ్ కు వెల్లివచ్చిన వారే ఉన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా ఢిల్లీలోని మర్కజ్ కు వెల్లివచ్చిన వారే ఉన్నారు. దీంతో ప్రభుత్వం మర్కజ్ ప్రార్థనలకు వెల్లొచ్చిన వారి వివరాలను దాదాపుగా సేకరించి వారిని క్వారంటైన్ కి పంపి పరీక్షలు నిర్వహించింది. ఆ రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలిన వారిని వెంటనే గాందీకి తరలించి వైద్య సేవలు అందిస్తుంది. అయినా కొంత మంది మాత్రం ఢిల్లీ వెల్లొచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి వైరస్ ను మరింత విస్తృత పరుస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే అందరి ప్రాణాలను కాపాడాల్సిన ఓ వైద్యుడు నిజాన్ని దాచాడు. మర్కజ్ సన్నహక సమావేశానికి వెళ్లొచ్చి ఆపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆస్పత్రిలో విధులకు హాజరయ్యాడు. సమాచారాన్ని గోప్యంగా ఉంచి ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘించారు. కాగా ఆ వైద్యుడు మర్కజ్ వెల్లివచ్చిన విషయం తెలియగానే రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ అతనిపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఆ వైద్యునిపై సెక్షన్ 176, 188, 270, 271 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుడు క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నాడు.