Coronavirus Updates in Telangana: తెలంగాణలో ఈ రోజు ఎన్ని కేసులంటే!
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 945 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,339కి చేరింది. ప్రస్తుతం ఇందులో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా, 7,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవ్వాలా 1,712 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురూ మృతి చెందారు.
ఇక ఇవ్వాలా నమోదైన కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 869 కేసులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత రంగారెడ్డిలో 29, మేడ్చెల్ లో 13, సంగారెడ్డిలో 21, కరీంనగర్ లో 2, సిద్దిపేట లో 1, నిర్మల్ లో 4, మహబూబ్ నగర్ లో 2, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్ , నిజామాబాదులలో ఒక్కో కేసు నమోదు అయింది. ఇక మొత్తం ఈ రోజు 3,457 టెస్ట్ లను నిర్వహించారు.
ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.. దీనితో గ్రేటర్ హైదరాబాద్ లో మరో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు గత ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు చికిత్స అందిస్తోన్న తీరు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. ఇందులో అధికారులు హైదరాబాద్ లో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని నివేదించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.