తెలంగాణలో కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు..
Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(మంగళవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 84,544కి చేరింది. మృతుల సంఖ్య 654కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,920 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 61,294కి చేరింది. ప్రస్తుతం 22,596 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 22,972 మంది నమూనాలను పరీక్షించగా 1,897 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 6,65,847కి చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 479, రంగారెడీ-162, మేడ్చల్ 172, సంగారెడ్డి-107, వరంగల్ అర్బన్ 87, కరీంనగర్ 64, ఖమ్మం 63, సిద్ధిపేట 62, పెద్దపల్లి 62, నల్లగొండ 54, భద్రాద్రి కొత్తగూడెం 44, రాజన్న సిరిసిల్ల 43 కేసులు నమోదుఅయ్యాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.49గా ఉంది. దేశంలో 69.79గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.77 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.99 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.