Coronavirus Updates in Telangana: తెలంగాణలో వరుసగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 1879
Coronavirus Updates in Telangana: తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Coronavirus Updates in Telangana: తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం కొత్తగా 1879 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,612కు చేరగా.. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 7 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 313కు చేరింది. మంగళవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 14222 కేసులు వచ్చాయి.
ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ జిల్లాలో 94, కరీంనగర్ జిల్లాలో 32 వరంగల్ అర్బన్ 13 , మహబూబ్ నగర్ లో 11, కామారెడ్డిలో 7, గద్వాల్ లో 4, నల్గొండ లో 31, జిల్లాలో 10 నిజామాబాద్ జిల్లాలో 19, మెదక్ లో 12, మహబూబాబాద్ లో 2, భుపాలపల్లి లో 6, కొత్తగూడెం 3, ములుగు 12, ఆదిలాబాద్ , జనగాం, వనపర్తి, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.
కొత్తగా 1506 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 16,287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,012 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. శనివారం కొత్తగా 6,220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,438మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక అటు తెలంగాణ ప్రభుత్వం కూడా కంటైన్మేంట్ జోన్లలో లాక్ డౌన్ ని ఈ నెల 31 వరకు పొడిగించింది.