Coronavirus: జీహెచ్ఎంసీ పరిధిలో విజృంభిస్తున్న కరోనా.. ఆందోళనలో ప్రజలు!
coronavirus: జీహెచ్ఎంసీలో కరోన రోజురోజుకు విజృంబిస్తోంది. ప్రతిరోజు కొత్త ప్రాంతాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో ఏక్కడైతే పాజిటివ్ కేసులు నమోదయ్యేవో అక్కడ పూర్తీగా కట్టడి ప్రాంతంగా పెట్టి ఎవరు బయటకు రాకుండా చూసేవారు. ప్రస్తుతం నగరంలో 8 సర్కిళ్ల పరిదిలో మాత్రమే కంటైన్మెంట్ జోన్ లు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి మొదలైందని ఇప్పటికే వైద్య అధికారులు ప్రకటించారు. టెస్టుల సంఖ్యతోపాటు పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్యా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ వ్యాధి నియంత్రణకు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కేసుల సంఖ్యను బట్టి కాలనీలు, బస్తీలను పేరుకే కట్టడి ప్రాంతాలుగా ప్రకటించి ప్రభుత్వ విభాగాలు చేతులు దులుపుకుంటున్నాయి. గతంలోలా కట్టడి ప్రాంతాల్లో బారికేడ్ల ఏర్పాటుతో పాటు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలి.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ప్రజలు వైరస్ విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్లే వైరస్ వేగంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు చేప్తున్నారు. గతంలో పాజిటివ్ వచ్చిన పేషంట్స్ ఇంటి ముందు ప్లేక్సిలతో ప్రకటించేవారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పాజిటివ్‌గా నమోదైన వారిలో లక్షణాలు, అనారోగ్య సమస్యలను బట్టి హోం ఐసొలేషన్‌లో ఉంచుతున్నారు. వారు వివిధ అవసరాల నిమిత్తం భయటకు రావడం వల్ల ఇతరులకు వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్ సోకిన వారితో పాటు ఆ ఇంట్లో ఉండే వారు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కానీ జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు.
టెస్టులు చేయించుకున్న తర్వాత రిజల్ట్ పాజిటివ్ వస్తే వ్యక్తులు తమ కాంటాక్టు దోరకకుండా మొబైల్ లు స్విచ్చాఫ్ చేయడం, తప్పుడు అడ్రస్ లు ఇవ్వడం నగరంలో కేసులు పెరగడానికి మరో కారణం. హోం ఐసోలేషన్ కిట్స్ కూడ పంపించకుండా నగరంలో రెండు వేల మంది వరకు తప్పుడు అడ్రస్ లు ఇచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళు బయట తిరగడం వల్లే పెద్ద ప్రమాదమే పోంచి ఉందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే పాజిటివ్ కేసులు పెరుగుతుడండతో బల్దియా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రత్యేకంగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాల్లో కట్టిడి చేసి, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పెంచాలి. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అలాగే పాజిటివ్ కేసుల ఇళ్ల వద్ద బ్లీచింగ్ చల్లడంతో పాటు సోడియం హైపో క్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలి.