Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,430 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,430 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Update: 2020-07-21 16:51 GMT
Coronavirus

Coronavirus updates in Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,430 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 47,705కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 10,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2,062 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 36,385 కి చేరుకుంది. ఇక ఇవ్వాలా ఏడుగురు కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 429 కి చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 16, 855 టెస్టులు చేశారు.

ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 703 కేసులు ఉన్నాయి. ఇక మిగతా జిల్లాల విషయానికి వచ్చేసరికి.. రంగారెడ్డి 117, మేడ్చెల్ 105, సంగారెడ్డి 50, వరంగల్ అర్బన్ 34, కరీంనగర్ 27,జగిత్యాల 18, మహబూబబాద్ 27, మహబూబ్ నగర్ 06, భూపాలపల్లి 27, నల్గొండ 45, నిజామాబాద్ 48, నాగూర్ కర్నూల్ 18, సూర్యాపేట 27, జనగామ 09, సిద్దిపేట 12, మెదక్ 26, గద్వాల్ 4, పెద్దపెల్లి 4, ఖమ్మం 14, వరంగల్ రూరల్ 20, నిర్మల్ 1, యాదాద్రి భువనగిరి9 ఒక్కో కేసు నమోదు ఆయునట్టుగా సోమవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.

ఇదిలావుంటే గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకొని వారు పెద్ద సంఖ్యలో ఉండడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.


 

Tags:    

Similar News