Poet Nissar Died Impact Coronavirus: కరోనాకు బలైన కవిగాయకుడు..
Poet Nissar Died Impact Coronavirus: కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది అమాయక ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి ప్రాణాలను కోల్పోతున్నారు
Poet Nissar Died Impact Coronavirus: కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది అమాయక ప్రజలతో పాటు వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పుడు ఓ కవిగాయకుడు కూడా ఈ జాబితాలో చేరారు. కరోనా వైరస్ గురించి పాటలను రచించి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఓ ప్రముఖ కవిగాయకుడు నిస్సార్ కరోనా మహమ్మారి బారిన పడి బలైపోయాడు. ఈయన ప్రజల్లో ఈ కరోనా వైరస్ గురించి తన పాటలతో చైతన్యం తీసుకొచ్చి చివరికి ఆ మహమ్మారి చేతిలోనే బలైపోవడం విశాదకరం.
'కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!'అంటూ కరోనాపై కలం గురిపెట్టిన కవిగాయకుడు కోవిడ్ బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఆయన అకాల మరణంపై పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆ కవిగాయకుడు రాసిన పాటను సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస ఆలపించారు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ మాట ప్రేక్షకాదరణ కూడా పొందింది.
ఇక పోతే తెలంగాణ లో మంగళవారం కొత్తగా 1879 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,612కు చేరగా.. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 7 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 313కు చేరింది. మంగళవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 14222 కేసులు వచ్చాయి. ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ జిల్లాలో 94, కరీంనగర్ జిల్లాలో 32 వరంగల్ అర్బన్ 13 , మహబూబ్ నగర్ లో 11, కామారెడ్డిలో 7, గద్వాల్ లో 4, నల్గొండ లో 31, జిల్లాలో 10 నిజామాబాద్ జిల్లాలో 19, మెదక్ లో 12, మహబూబాబాద్ లో 2, భుపాలపల్లి లో 6, కొత్తగూడెం 3, ములుగు 12, ఆదిలాబాద్ , జనగాం, వనపర్తి, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.