తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న రాత్రి పూట కర్ఫ్యూను ఈనెల 31 తర్వాత కూడా కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో దానికి అనుగుణంగానే పొడిగించాలని సీఎం కేసిఆర్ ఆలోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
నిత్యావసరాల గురించే ప్రజలు అధికంగా బయటకు వస్తున్నారని అధికారులు సీఎంకు తెలుపగా, ప్రజలు తిరుగుతూ ఉంటే కరోనాను ఆపలేమని, లాక్ డౌన్, కర్ఫ్యూలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించిన కేసీఆర్, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.పేదలకు హామీ ఇచ్చిన విధంగా రూ. 1,500 నగదు బదిలీ ప్రక్రియను ప్రారంభించాలని, పేదలకు రేషన్ బియ్యాన్ని సైతం సాధ్యమైనంత త్వరగా అందించాలని కేసీఆర్ ఆదేశించారు.